![]() |
![]() |

ఇద్దరు లవర్స్ కలిసి ఒకదగ్గర ఉంటే సమస్యలేంటి.. ఆలోచిస్తే ప్రతీది కలుపుకోవాలి. ఇండివిడ్యువల్ గా ఏదీ జరగదు. ఒకరికి నచ్చింది మరొకరు అడ్జస్ట్ అవ్వాల్సిందే. అదే జరుగుతుంది బిగ్ బాస్ సీజన్ సిక్స్ రన్నరప్ శ్రీహాన్ కి. ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఓ పాటని తీసుకొని దానికి మంచి వీడియోని ఆడ్ చేసి ఎడిట్ చేసుకొని శ్రీహాన్ అప్లోడ్ చేశాడు. అయితే ఆ వీడియో పోస్ట్ కి సిరి కోపంతో ఓ కామెంట్ చేసింది. అసలేంటా కామెంట్.. ఓ సారి చూసేద్దాం.
శ్రీహాన్.. బిగ్ బాస్ సీజన్-6 లో ఫైనల్ వరకు చేరుకొని ఒక్క అడుగు దూరంలో వెనుదిరిగి.. రన్నర్ గా నిలిచాడు. దీంతో శ్రీహాన్ కి క్రేజ్ విపరీతంగా పెరిగింది. బిగ్ బాస్ ముందువరకు శ్రీహాన్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు.. ఈ షోతో బాగా ఫేమస్ అయ్యాడు. శ్రీహాన్ నటుడే కాకుండా మంచి సింగర్ కూడా. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు రేవంత్, శ్రీసత్యలతో కలిసి ఉన్న శ్రీహాన్.. ప్రేక్షకులకి కన్నింగ్ మైండెడ్ లా అనిపించేది. ప్రతీసారీ ఇనయాని టార్గెట్ చేసి కావాలనే నామినేషన్లలో గొడవలు పెట్టుకున్నాడని స్పష్టంగా తెలిసింది. అయితే మరో పక్క శ్రీసత్యతో లవ్ ట్రాక్ కూడా నడిపాడని అనుకునేవారు లేకపోలేదు. ప్రతిసారీ శ్రీసత్యని హగ్ చేసుకోవడం.. గేమ్స్ లో తనకే సపోర్ట్ చేయడం.. మిగతావాళ్ళని శత్రువులను చూసినట్టు చూడటంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకి సైతం తెలిసిపోయింది. ఫ్యామిలీ వీక్ లో.. తన గర్ల్ ఫ్రెండ్ సిరి వచ్చినప్పుడు కూడా శ్రీహాన్ కి కొన్ని టిప్స్ చెప్పింది. అందులో శ్రీసత్యతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది సిరి. శ్రీహన్, సిరి ఇద్దరు లవ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. ఇద్దరు కూడా బిగ్ బాస్ కి వెళ్ళి ఫేమ్ సంపాదించినవాళ్ళే. శ్రీహన్ సోషల్ మీడియాకి కొంచెం దూరంగానే ఉంటాడు. తనకి సంబంధించిన ఏ అప్డేట్ అయిన ఫ్యాన్స్ వరకు వెళ్ళదు.
అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో శ్రీహాన్ చేసిన ' ట్రెండింగ్ అంటార్రా బాబు' అనే ఓ పోస్ట్ కి సిరి తన స్టైల్ లో కామెంట్ చేసింది. " మర్యాదగా నా కోసం కూడా ఎడిట్ చేయు " అని సిరి కామెంట్ చేయగా.. పదివేలిస్తే ఎడిట్ చేసి ఇస్తానని శ్రీహాన్ ఆ కామెంట్ కి రిప్లై ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ తో పాటు సిరి చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. కొందరు ఫ్యాన్స్ అయితే.. " వదిన మా అన్నయ్యని బాగానే బెదిరిస్తున్నారుగా" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
![]() |
![]() |